telugu navyamedia
క్రీడలు వార్తలు

అభిమానుల నిరాశ… పడిపోయిన రేటింగ్స్

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండో రోజు ఆట సాగింది కానీ దానికి ఆటంకాలు ఏర్పడాయి. శనివారం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ సెషన్ చివర్లోనే మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. ఇక చివరి సెషన్‌ ఆరంభంలో వెలుతురులేమితో మరో రెండుసార్లు అంతరాయం కలిగింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇక ఎంతగానో ఎదురు చూసిన ఈ మ్యాచ్‌ ఎట్టకేలకు ఆరంభమైనా పదే పదే అంతరాయం కలగడంతో అభిమానులు చికాకు గురయ్యారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోయాయి. మాములుగా భారత్ మ్యాచ్‌ జరిగితే డిస్నీ+హాట్ స్టార్‌లో 25 నుంచి 30 లక్షల మంది వీక్షిస్తారు. కానీ శనివారం మ్యాచ్ ఆరంభమైన తర్వాత హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య ఏ దశలోనూ 15 లక్షలు దాటలేదు. అంటే వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదోననుకున్నారో? మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలియదో? లేక ఆడుతూ ఆగుతూ మ్యాచ్ సాగుతుండటంతో లైట్ తీసుకున్నారో తెలియదు కానీ ప్రేక్షాకాదరణ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక టీవీ ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చినట్లు లేదు. పదే పదే మ్యాచ్ ఆగుతుండటంతో అందరూ చానెళ్లు మార్చేసారు. పైగా పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుండటం.. పరుగులు చేయడానికి బ్యాట్స్‌మెన్ తడబడటం కూడా టీఆర్‌పీ రేటింగ్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

Related posts