telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా టీకా తీసుకున్న 23 మంది వృద్ధుల మృతి

నార్వే దేశంలో తొలి డోసు తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. మరీ బలహీనంగా ఉన్న వృద్ధులు సైడ్ ఎఫెక్ట్స్‌ వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఏ మాత్రం ఆరోగ్యంగా లేని వృద్ధులకు టీకా ఇస్తే… వారిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అతి తక్కువ జీవితకాలం ఉన్నవారిలో లాభం పెద్దగా ఉండదని.. వారికి టీకా అనవసరం ఉన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్యం శాఖ వ్యక్తం చేసింది. ఆరోగ్యవంతులు, యువకులు ఈ టీకాను తీసుకోవచ్చని నార్వే ప్రభుత్వం చెబుతోంది. వృద్ధుల మృతి పట్ల ఫైబర్‌, బయోఎన్‌ కంపెనీ విచారణ చేపడుతున్నది. టీకా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని.. అనుకున్న రీతిలో సంఘటనలు జరుగుతున్నట్లు ఫైబర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నంది. వైరస్‌ వల్ల రిస్క్‌ ఉన్న సుమారు 33 వేల మందికి ఇప్పటి వరకు టాకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ప్రభావం ఉండగా… దాంట్లో మూడో వంతు 80 ఏళ్లు దాటినవారే ఉన్నారు.

Related posts