telugu navyamedia
క్రీడలు వార్తలు

కోచ్ రమేశ్ పవార్‌తో గొడవపై స్పందించిన మిథాలీ రాజ్…

భారత మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రమేశ్ పవార్‌తో గొడవపై వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి స్పందించింది. ‘నేను కొన్నేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాను. నాకు ఎలాంటి ఇగో లేదు. భారత్ జట్టుకి ఆడే సమయంలో వ్యక్తిగత ఇష్టా.. అయిష్టాలకి ప్రాధాన్యం ఇవ్వను. ఇండియాకు ఆడటమంటే.. దేశానికి సేవ చెయ్యడమే. కాబట్టి.. వ్యక్తిగత సమస్యలకి నేను ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వను. ఇప్పుడు రమేశ్ పొవార్ కోచ్. అతను టీమ్‌కి సంబంధించి ప్లాన్స్ వేస్తాడు. ఇద్దరం కలిసి సమన్వయంతో జట్టుని ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం” అని మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. ఇక యువ క్రికెటర్ షెఫాలీ వర్మ.. మూడు ఫార్మాట్లలో ఉండటం మంచిదేనని భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో విఫలమైన తాము యూకే టూర్‌లో గాడిలో పడటం చాలా కీలకమని చెప్పుకొచ్చింది. ‘బిగ్ హిట్టర్ షెఫాలీ మూడు ఫార్మాట్లలో ఉండటం టీమ్‌కు చాలా ప్రయోజనం. ఇప్పటికే షార్ట్ ఫార్మాట్‌లో ఆమె నిరూపించుకుంది. మిగతా రెండింటిలోనూ ఎలా ఆడుతుందో చూడాలి. యంగ్ ప్లేయర్లకు ప్లేస్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అనుభవాన్ని షేర్ చేసుకోవడం వల్ల బాగా ఆడటానికి దోహదం చేస్తుంది.’ అని మిథాలీ చెప్పుకొచ్చింది.

Related posts