telugu navyamedia
క్రీడలు వార్తలు

సిరీస్ కోల్పోయిన భారత్…

భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మహిళలతో 5 వన్డేల సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే మన మహిళలకు లాక్ డౌన్ తర్వాత ఇదే మొదటి సిరీస్. అయితే ఈ సిరీస్ ను భారత మహిళలు 4-1 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. ఈ రోజు జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిపోయిన మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొత్తం 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అందులో భారత కెప్టెన్ మిథాలీ రాజ్(79) మాత్రమే అర్ధశతకం సాధించింది. ఆలాగే 30 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ రిటైడ్ హర్ట్ గా వెనుదిరిగింది. ఇక ఆ తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన దక్షిణాఫ్రికా మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. మిగ్నాన్ డు ప్రీజ్(57), అన్నే బాష్(58) తో రాణించడంతో ఈ మ్యాచ్ తో పాటుగా సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఒక్క సిరీస్ లో భారత కెప్టెన్ మిథాలీ చాలా రికార్డులను సొంతం చేసుకున్న ఇషయం తెలిసిందే. 10,000 అంతర్జాతీయ పరుగులు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్ గా అలాగే వన్డేల్లో 7,000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా ఘనత సాధిచింది.

Related posts