telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ నోటీసులు.. స్పందించిన రేవంత్‌రెడ్డి

Revanth-Reddy mp

టీఆర్‌ఎస్‌ నేతలకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. 2017, ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నేతలు వరంగల్‌ ప్రగతి నివేదన సభ కోసం కార్యకర్తల దారి ఖర్చులకు గులాబీ కూలీ పేరిట ఆ పనులు చేశారు. కూలీ పనులు చేసి నిమిషాల వ్యవధిలోనే లక్షల రూపాయలు సంపాదించిన నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని గతంలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

చట్టాలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదు చేసి, కోర్టుకు వెళ్లారు. ఈ కారణంగానే టీఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ నోటీసులు అందినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధిచిన వార్తను పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. ‘పగులుతున్న పాపాల పుట్ట’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Related posts