telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈ నెల 5న ఏపీ బంద్‌…

barath band in progress

ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.   దీనికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ ఏకంగా తన పదవికి రాజీనామా కూడా చేశారు. అటు వైసీపీ ఎంపీ ప్రైవేటీకరణకు నిరసనగా 25 కిమీ పాదయాత్ర కూడా చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన రావడం లేదు. ప్రైవేటీకరణ దిశగానే మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ నెల 5న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు మద్దతుగా వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు, థియేటర్లు, పరిశ్రమలు, రాజకీయ పార్టీలతో సహా అన్ని వర్గాలు సహకరించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరాయి. 

Related posts