telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ కు ముందు సీఎం కేసీఆర్‌.. తెలంగాణలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. ఈ ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉప ఎన్నిక ముగిసిన అనంతరం ఏప్రిల్‌ మూడో వారంలో మొదటి ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాలీల జాబితాను చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌కు అప్పగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 55 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఇందులో పోలీస్‌ శాఖలోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్‌ ఉద్యోగ ఖాళీలు సైతం అధికంగానే ఉన్నాయని సమాచారం. అయితే.. నోటిఫికేషన్‌ మాత్రం వచ్చే నెలలో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Related posts