telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరించిన చెత్తను ఎస్.సి.టి.పి లకు ఎప్పటికప్పుడు తరలించాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్

స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ పోర్ట్  పాయింట్ లకు ఎప్పటికప్పుడు తరలించాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం శేరిలింగంపల్లి సర్కిల్ లో శానిటేషన్ పనితీరును కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ ఆటోల పనితీరు పై ప్రత్యేక అధికారిని నియమించి చెత్తను సరియైన సమయంలో తరలించేందుకు చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలు చెత్తను ఎస్.సి.టి.పి లకు తరలించడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సకాలంలో స్వచ్ఛ ఆటోలు చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు వేగవంతంగా తరలించాలన్నారు. సర్కిల్ లో ఎన్ని స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. నగర వ్యాప్తంగా స్వచ్ఛ ఆటోలు సరియైన సమయంలో చెత్తను ఎస్.సి.టి.పి లకు వేగవంతంగా తరలించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రజిని కాంత్ రెడ్డి, మంగతాయారు, శానిటేషన్ అధికారులు ఉమా ప్రకాష్, మోహన్ రెడ్డి, సూర్య కుమార్, సువార్త, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts