telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

స్టాండింగ్ కమిటీ సమావేశంలో 16 అంశాలకు కమిటీ ఆమోదం

నగ‌ర మేయ‌ర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్య‌క్ష‌త‌న బుధవారం స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో 16 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు అని మేయర్ తెలిపారు.

ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ మిన్హాజుద్దీన్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ అబ్దుల్ ముక్తర్, మహమ్మద్ మాజీద్ హుస్సేన్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, బండారి రాజ్ కుమార్, వనం సంగీత యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, ఇ.ఎస్. రాజ్ జితేందర్ నాథ్ లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు చంద్రకాంత్ రెడ్డి, జయరాజ్ కెనడి, విజయలక్ష్మి, గీతా రాధిక, ఉపేందర్ రెడ్డి, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయక్, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్, సి.ఇ దేవానంద్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఎన్.డి.పి సి.ఇ కిషన్, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, వెటర్నరీ చీఫ్ అబ్దుల్ వకీల్, జోనల్ కమిషనర్లు రవి కిరణ్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, మమత, వెంకన్న, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన అంశాలు

1. కూకట్ పల్లి జోన్ గాజులరామారం సర్కిల్ వోక్షిత్ ఎన్ క్లేవ్ వార్డు నెం.125 లో వరద ముంపు నివారణకు పెద్ద చెరువు నుండి జంగం బంధం కుంట వరకు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ ను రూ. 11.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు పరిపాలన అనుమతికై కమిటీ ఆమోదం.

2. జిహెచ్ఎంసి కార్యాలయంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న టి.ఎస్. జెన్కో, టి.ఎస్. ట్రాన్స్ కో, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్, టి.ఎస్. ఎన్.పి.డి.సి.ఎల్ 41 మంది ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేల్ 2022 ను రూ. 5,89,84,264 అదనపు వ్యయాన్ని చెల్లించడానికి కమిటీ ఆమోదం.

3. జూబ్లీహిల్స్ న్యాయ విహార్ రోడ్ వద్ద ఉన్న 600 చదరపు గజాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని షూటర్ ఇషా సింగ్ కు కేటాయించేందుకు ఎన్.ఓ.సి ఇవ్వడానికి కమిటీ ఆమోదం.

4. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ఉన్న 2,952 చదరపు గజాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజన్ ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు కేటాయించేందుకు ఎన్.ఓ.సి ఇవ్వడానికి కమిటీ ఆమోదం.

5. ఎల్బీనగర్ జోన్ కాప్రా సర్కిల్, కాప్రా చెరువు వద్ద బయోడైవర్సిటీ పార్క్ డెవలప్మెంట్ ద్వారా గ్రీన్ యాత్ర సంస్థ సి.ఎస్.ఆర్ పద్ధతిలో మూడు సంవత్సరాల పాటు ట్రీ ప్లాంటేషన్ చేపట్టేందుకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసేందుకు కమిటీ ఆమోదం.

6. శేరిలింగంపల్లి జోన్ వార్డు నెం.99 వెంగళరావు నగర్, జవహర్ నగర్ లో స్పెషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్స్ కింద రూ. 5.60 కోట్ల తో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు పరిపాలన అనుమతులకు కమిటీ ఆమోదం.


7. హౌసింగ్ ద్వారా సంగారెడ్డి జిల్లా ఆర్.సి.పురం మండలం కొల్లూర్, కే.సీ.ఆర్ నగర్ లో 2 BHK ప్రారంభోత్సవ కార్యక్రమంలో డి.ఇ.సి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అత్యవసరంగా రూ. 87 లక్షలను ఖర్చు చేసినందుకు సేవింగ్ అకౌంట్ నుండి ఖర్చు చెల్లింపుకు కమిటీ ఆమోదం.

8. హౌసింగ్ ద్వారా మేడ్చల్ నియోజకవర్గం ఘట్ కేసర్ మండలం ప్రతాప్ సింగారం 2 BHK కాలనీ ప్రారంభోత్సవానికి ఆర్.ఎన్.సి-ఆర్.కె.ఐ-ఎస్.ఎస్.ఎస్.సి జాయింట్ వెంచర్ ఏజెన్సీ అత్యవసరంగా రూ. 10.15 లక్షలను ఖర్చు చేసినందుకు సేవింగ్ అకౌంట్ నుండి ఖర్చు చెల్లింపుకు కమిటీ ఆమోదం.

9. ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ భవాన్స్ స్కూల్ ఎదురుగా రోడ్ నెం. 44/45 వద్ద ట్రీ పార్కు డెవలప్మెంట్, మెయింటనెన్స్ ను ఎం/ఎస్ ఎన్ హాన్స్ హోం ఎక్సపర్ట్ సంస్థ సి.ఎస్.ఆర్ పద్దతిలో మూడు సంవత్సరాలు నిర్వహించడానికి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసుకునేందుకు కమిటీ ఆమోదం.

10. సి.ఎస్.ఆర్ పద్ధతిలో బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్క్ డెవలప్మెంట్ చేయడానికి ఎం/ఎస్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థకు మూడు సంవత్సరాల పాటు నిర్వహించేందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసుకునేందుకు కమిటీ ఆమోదం.

11. ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో హైటెన్షన్ వైర్ కింద, ఫ్లైఓవర్ కు దక్షిణాన ఉన్న 5,200 మీటర్ల ఖాళీ స్థలాన్ని డెవలప్మెంట్, మెయింటనెన్స్ ను మూడు సంవత్సరాల పాటు సి.ఎస్.ఆర్ పద్దతిలో చేయడానికి ఎం/ఎస్ సైబర్ సిటీ బిల్డర్స్ డెవలపర్స్ ప్రై.లిమిటెడ్ తో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసుకునేందుకు కమిటీ ఆమోదం.

12. ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46/51 లో యు.బి.డి ద్వారా హైటెన్షన్ వైర్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ లలో ఉన్న 1470 మీటర్లు, 660 మీటర్ల ఖాళీ స్థలంలో సి.ఎస్.ఆర్ ద్వారా మూడు సంవత్సరాల డెవలప్మెంట్, నిర్వహణకు సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలప్ ప్రై.లిమిటెడ్ తో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ తో ఎం.ఓ.యు చేసుకునేందుకు కమిటీ ఆమోదం.

13. శేరిలింగంపల్లి జోన్ మీయాపూర్ వద్ద ఉన్న రేగుల కుంట చెరువు సుందరీకరణకు సి.ఎస్.ఆర్ పద్ధతిలో ఒక సంవత్సరం పాటు నిర్వహణకు ఎం./ఎస్ మళ్లిగవద్ ఫౌండేషన్ తో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసుకునేందుకు కమిటీ ఆమోదం.

14. సి.ఇ లేక్స్ ద్వారా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లి లో ఉన్న పెద్ద తాళ్ల కుంట చెరువు ను సి.ఎస్.ఆర్ పద్ధతిలో మూడు సంవత్సరాల పాటు సుందరీకరణ చేపట్టడానికి జి.ఎస్.టి, కస్టమ్స్ శాఖ ద్వారా చార్మినార్ జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసుకోవడానికి కమిటీ ఆమోదం.

15. శేరిలింగంపల్లి సర్కిల్ లో ఐకియా రోటరీ వద్ద గ్రీనరి ని మెయింటెనెన్స్ ను మూడు సంవత్సరాల పాటు సి.ఎస్.ఆర్ కింద ఎం/ఎస్ యు.ఎస్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేసుకునేందుకు కమిటీ ఆమోదం.

16. జిహెచ్ఎంసి 30 సర్కిళ్లలో 30 మంది డిప్యూటీ కమిషనర్లకు మహీంద్రా బొలెరో నియో ఎన్-8 మోడల్ ను రూ. 3,71,89,590 లతో ఈ-ప్రొక్యూర్ మెంట్ ద్వారా టెండర్ కాల్ చేయడానికి పరిపాలన అనుమతికై కమిటీ ఆమోదం.

Related posts