telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నారా లోకేష్ పై మంత్రి అనిల్ ఆగ్రహం…

మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబు, నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తండ్రి కి పిచ్చి పట్టింది, తండ్రికి మానసిక స్థితి బాలేదు, నీకు పదవి లేదు అని అన్నారు. ఇంకో నెలలో ఎమ్మెల్సీ ఉంది… నువ్వు సర్పంచ్ గా కార్పొరేటర్గా జెడ్పిటిసి గెలవలేవు… మీ నాన్న అధ్యక్ష పదవి ఇచ్చే పరిస్థితి లేదు… రాజ్యసభ పదవి ఇవ్వడు… మీ నాన్న దగ్గరికి వెళ్లి చిటిక వెయ్యి… అంతేగాని జగన్ గురించి మాట్లాడకు అని తెలిపారు. కౌన్సిల్ కి వస్తావు కదా మా ముందు చిటికె వేసి మాట్లాడు చూద్దాం అని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుని ఐదో తరగతి పిల్లవాడు మాట్లాడుతాడు. దమ్ముంటే బయటికి రా… ఉంటే పోతారు ఉంటే పోతారు అంటున్నావు ఉన్న ఏమి పీకలేవు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తట్టుకోలేకపోయారు ఈరోజు తట్టుకోగలరా… సింహం వేటాడా వలసిన అవసరం లేదు సింహం చూపు చాలు అని పేర్కొన్నారు. చూడాలి మరి దీని పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts