మనమంతా మాతృభాషను గౌరవించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారత రాజ్యాంగ 70వ వార్షిక దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలుగులో మాట్లాడుతూ..మాతృభాష కళ్లలాంటిదని, ఇతర భాషలు కళ్లద్దాల వంటిదని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలని ఆయన అన్నారు. మన మొదటి ప్రాధాన్యత మాతృభాషకే ఇచ్చి, ఆ తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
మనలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వహించకుంటే హక్కులు అమలు కావని చెప్పారు. మన దేశాన్ని మార్చడమనేది మన లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించామని తెలిపారు. పరిపాలనలో మనం అనేక మార్పులు తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వానికి ఆత్రమే తప్ప శ్రద్ధ కొరవడింది: కన్నా