telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎగసిపడే కెరటం….

ఎగసిపడే కెరటాన్నికాను
పోటెత్తలేను
ఉరిమే వురుమును కాను
మేఘమై వర్షించలేను
పూసే తీగను కాను
పుష్పాలనివ్వలేను
కాసేచెట్టునికాను
ఫలాలనివ్వలేను
విప్లవకారున్నికాను
ఉధ్యమించలేను
పోరాడేసైనికుడిని కాను
యుద్ధం చేయలేను
రాజును కాను
పాలించలేను
దైవాన్నికాను
వరాలు ఇవ్వలేను
సాటిమనిషిని నేను
చేయూతనివ్వగలను
………………………..
ప్రకృతి నీవై పరవశించగ
పరవల్లుతొక్కే గోదారల్లే నీరూపం
కవ్యాలు రాయగ కవికలం మెలికలు తిరిగెను
సొంపైన నీ ఒంపులు చూసి
పసిడి వన్నెగల నెరజాణ
నినువర్ణించ నాకు సాధ్యమా ……

Related posts