telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

liquor shops ap

లాక్ డౌన్ లో కేంద్రం సడలింపులివ్వడంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపులకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మద్యం కొనుగోళ్ల సమయంలో భౌతికదూరాన్ని కూడా పాటించడం లేదని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాలు రాష్ట్రాల విధానపరమైన నిర్ణయాలని తెలిపింది.

మద్యం అమ్మకాలను తాము నిషేధించలేమని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలకు ఆన్ లైన్ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికి డోర్ డెలివరీ చేయాలని సూచించింది.

Related posts