telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమే : సజ్జల రామ కృష్ణా రెడ్డి

sajjala

ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల చుట్టూ రాజకీయం నడుస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయన్న ఆయన ప్రజారోగ్యం కోసం ఇన్నాళ్లు ఎన్నికలు వద్దు అనుకున్నాం అనీ కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల ఇప్పటికే పంచాయతీ ఎన్నిలకల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేసి పంచాయతీ ఎన్నికలను తీసుకురావడంలో రాజకీయ కుట్ర దాగి ఉందని సజ్జల ఆరోపించారు. ఎస్ఈసీ మొండి వైఖరి వల్లే సుప్రీంకోర్టు పిటిషన్ వేశామన్న సజ్జల ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని ఎస్ఈసీకి వివరించామని అయినా ఆయన వినలేదన్నారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహిస్తే గందరగోళ పరిస్థితికి దారితీస్తాయని సుప్రీంకోర్టుకు వివరించామన్నారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ పై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అన్నారు, ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను చెప్పారు.

Related posts