telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అంబానీకి మరో షాక్‌ తగలనుందా…?

ప్రస్తుతం అప్పుల సంక్షోభంలో పడి దివాలా బాటపట్టిన అనిల్‌ అంబానీకి మరో షాక్‌ తగలనుంది. రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. ఆస్తుల అమ్మ‌కం కోసం బ్యాంక‌ర్స్ బిడ్స్ ఆహ్వానించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దాదాపు 20వేల కోట్ల బ‌కాయిల‌ను రిక‌వ‌రీ చేసే ప‌నిలో బ్యాంకులున్న‌ట్లు సీఎన్బీసీ క‌థ‌నం వెలువ‌రించింది.  రుణ బకాయిలను తిరిగి పొందేందుకు భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న వర్గాల నుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం.  ఆర్‌సిఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) లను ఆహ్వానించడానికి పత్రాలను జారీ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు అతిపెద్ద రుణాలు ఇచ్చిన బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, కొన్ని నెలల క్రితం దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌బి‌ఐని కోరింది, కాని ఆర్‌బి‌ఐ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ ఆస్తుల అమ్మ‌కం వార్త‌ల‌పై రిల‌య‌న్స్ అధినేత అనిల్ అంబానీ ఇంకా ఏ విధంగా స్పందించలేదు.

Related posts