telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాపని అయిపోయింది… ఇక మీపనే… రాజమౌళి సవాల్

rajamouli ideology changed with RRR

కరోనా కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్‌డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ సెల‌బ్రిటీస్ విష‌యానికి వ‌స్తే అంద‌రూ ఇంటి పనులు, వంట ప‌నులు చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ మ‌గ‌వారికి ‘బీ ది రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ విసిరారు. ఆయన ఇంటి పనులు చేస్తున్న వీడియోని షేర్ చేసి.. దర్శకధీరుడు రాజ‌మౌళిని ఈ ఛాలెంజ్‌కు ఆయ‌న నామినేట్ చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి ప‌నులు చేస్తున్న వీడియో ఒక‌టి పోస్ట్ చేయాల‌ని రాజ‌మౌళిని రిక్వెస్ట్ చేశారు సందీప్ వంగా. సందీప్ ఛాలెంజ్‌కు రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సోమవారం త‌ను ప‌నిచేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తాన‌ని రాజ‌మౌళి తెలిపారు. చెప్పినట్లుగానే ఆయన ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి ఇంట్లో పనిచేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ పనులే మీరు కూడా చేయాలని ఎన్టీఆర్ రాంచరణ్ లతోపాటు కీరవాణికి కూడా సవాల్ విసిరాడు రాజమౌళి. 

Related posts