telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును పెంచాలని కేంద్రం నిర్ణయం

Corona Virus Vaccine

ప్రపంచాన్ని వణికిసఞ్చిన కరోనా మన దేశాన్ని కూడా గత ఏడాది కాలంగా అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ కుఈ ఏడాది ఆరంభం నుండి మన దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొదట కరోనా ఫ్రంట్ వారియర్స్.. ఇలా దశలవారీగా అందరికీ అందుబాటులోకి తెస్తుంది ప్రభుత్వం.. అయితే, వ్యాక్సిన్ రెండు డోసులుగా తీసుకోవాలి.. తొలి డోసుకు, మలి డోసుకు మధ్య గ్యాప్ ఉండాలి.. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులపై కేంద్రం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రెండు డోసుల మధ్య గడువును మరో రెండు వారాలు పెంచాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. గడువు పెంచడం ద్వారా కోవిషీల్డ్‌ పనితీరు మెరుగు అవుతుందని..  మరింత ప్రభావంతంగా వైరస్‌ను ఎదుర్కొంటుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్‌ ఉంది..! అయితే ఇప్పుడు దానిని నాలుగు నుంచి ఎనిమిది వారాల గడువు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. అయితే మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈరోజు మన దేశంలో 40 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Related posts