శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల బాంబు దాడిలో 252 మంది మృతిచెందగా, 300మందికి పైగా గాయాలయ్యాయి. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటన పై ఏపీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న ప్రజలపై ఉగ్రదాడి అమానుషమని వ్యాఖ్యానించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాదుల దాడి అమానుషం. కేవలం కొంతమంది మూర్ఖత్వానికి ఇలా వందలమంది మరణించడం చాలా బాధాకరం. ఉగ్రవాదుల నీచమైన చర్యలను ఖండిస్తున్నాను. దాడిలో మరణించినవారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా అని ట్వీట్ చేశారు.