telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గర్భిణీపై నటి కుటుంబం దాడి

Actress

ఎనిమిది నెలల గర్భిణిపై దాడి చేసిన కేసులో అమెరికాకు చెందిన ఓ నటి విచారణ ఎదుర్కొంటోంది. “ఎ బిగ్ ఫాట్ జిప్సీ వెడ్డింగ్” అనే టీవీ ప్రోగ్రాంతో పాపులర్ అయిన జోసఫైన్ జోసీ మెక్‌ఫేడెన్ అనే ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మార్గరెట్ డోయెల్ అనే ఆ గర్భిణి పాక్షికంగా అంధురాలు. ఆమెకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమె ఎప్పుడు బయటకు వెళ్లినా ఎవరో ఒకరు తోడుంటారు. అలానే ఆ రోజు ఆమె సోదరితో కలిసి బార్ అండ్ రెస్టారెంటుకు వచ్చిందామె. వీరిద్దరినీ వెంబడించిన జోసీ కుటుంబం… బార్‌లో వారిద్దరిపై దాడికి తెగబడ్డారు. మార్గరెట్‌పై జోసీ కుంటుంబీకులు ఐదుగురు దాడి చేశారని, వారిలో కొందరు ఆమె తలపై, కొందరు గర్భంపై తీవ్రంగా కొట్టారని ఆమె సోదరి చెప్పింది. ‘కడుపులో పిల్లాడు కింద పడేలా కొట్టు’ అంటూ మిగతా కుటుంబీకులు కూడా వారిని ప్రోత్సహించారని తెలిపింది. నిందితులు ఐదుగురినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే తాము మార్గరెట్‌పై దాడి చేయలేదని, ఆమే తమపై దాడి చేసిందని జోసీ కుటుంబీకులు వాదిస్తున్నారు.

Related posts