telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ కేసీఆర్‌: కేటీఆర్‌ ట్వీట్‌

KTR TRS Telangana

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా తనయుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసలు కురిపించారు. సోమవారం కేసీఆర్‌ తన 67వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా కేటీఆర్‌ విలక్షణమైన సందేశాన్ని ట్వీట్‌ చేశారు. తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ కేసీఆర్‌ అని కొనియాడారు. నాకు తెలిసి మానాన్న ధైర్యశాలి, దయామయుడు అని అభివర్ణించారు.

‘కేసీఆర్‌ గొప్ప చరిష్మా గల నాయకుడు. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్వపడతాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నాకు ఆదర్శం. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు కలకాలం ప్రజాసేవలో ఉండాలి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Related posts