నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 3,299 పంచాయతీలు… 33,435 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే.. ఇప్పటి వరకు పోలింగ్ అయిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 78.9 శాతం కాగా…విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్…నెల్లూరు జిల్లాలో అత్యల్ప పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీ పోలింగ్ శాతం..
శ్రీకాకుళం 78.81
విజయనగరం 85.6
విశాఖ 84.07
ఈస్ట్ గోదావరి 74.90
వెస్ట్ గోదావరి 79.03
కృష్ణా 79.29
గుంటూరు 76.74
ప్రకాశం 78.77
నెల్లూరు 73.20
చిత్తూరు 75.68
కడప 80.68
కర్నూలు 76.52
అనంతపురం 82.26
“రజనీకాంత్ శరీరం అంత క్రిటికల్‌గా ఉంది మరి”… దర్శకుడి షాకింగ్ కామెంట్స్