telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

zz

HIT

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్‌సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన సినిమా ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. ప్రశాంతి తిపుర్నేని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల కాగా… దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రుహానీ శర్మ రొమాంటిక్ సీన్స్‌‌తో అలరించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. దీనిలో భాగంగా అసలు ‘హిట్’ (HIT) అంటే ఏమిటో తెలిపే వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇంతకీ హిట్ అంటే.. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం. అంటే హత్యోదంతాల్లో జోక్యం చేసుకునే బృందమన్నమాట. ఈ ప్రోమోను బట్టి చూస్తే ఇది హత్యకేసును ఛేదించే పోలీసు అధికారి కథ. పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్‌ సేన్ నటించారు. ‘‘ప్రీతి లాస్ట్‌గా 6 పీఎంకు ఓఆర్ఆర్ మీద కనబడింది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే మోటివ్ ఇంకా మాకు తెలీదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. తదుపరి వివరాలు హెచ్ఐటీ అధికారికంగా ప్రకటిస్తుంది. హెచ్ఐటీ అంటే హోమిసైడ్ ఇంర్వెన్షన్ టీం’’ అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగు ఈ ప్రోమోలో హైలైట్. మీరు కూడా ఈ ప్రోమోను వీక్షించండి.

Related posts