telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎందుకు అడల్ట్‌ని ఓ క్రైమ్‌లా చూపిస్తున్నారు : హీరో ఫైర్

Farhan-Aktar

సినిమాల్లో సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం వంటి వాటిపై డిస్‌క్లెయిమర్స్ వేయాలని సెన్సార్ ఎప్పటినుంచో రూల్ విధించిన సంగతి తెలిసిందే. సినిమాలకే కాదు టీవీ షోలకు కూడా ఈ గమనిక వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రూల్‌ను మరింత కఠినం చేసింది సెన్సార్. సినిమాల్లో మద్యం సీసాలు, సిగరెట్లు తాగుతున్నట్లు కనిపిస్తే డిస్‌క్లెయిమర్ వేయడమే కాకుండా వాటిని బ్లర్ చేయాలని సూచించింది. అయితే ఈ రూల్ ఇంకా భారతీయ చిత్ర పరిశ్రమలోకి రాలేదు. అయితే హాలీవుడ్ సినిమాలు మాత్రం చచ్చినట్లు ఈ రూల్‌ను పాటిస్తున్నాయి. ఇటీవల ఫర్హాన్ ‘ఫోర్డ్ వర్సెస్ ఫెరారి’ సినిమా చూశారు. అందులో మద్యం సేవించే సన్నివేశాల్లో మద్యం సీసాలను, గ్లాసులను బ్లర్ చేశారు. అది చూసి ఫర్హాన్ షాకయ్యారు. ఎందుకంటే హాలీవుడ్ సినిమాల్లో మద్యం తాగడం అనేది పెద్ద విషయం కాదు. విదేశాల్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది. అలాంటిది సినిమాల్లో మద్యం సీసాలను బ్లర్ చేయడం చూసి ఫర్హాన్ కంగుతిన్నాడు. వెంటనే సినిమాలోని ఓ సీన్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మున్ముందు థియేటర్లలో సినిమాలు కాదు కేవలం ప్రేక్షకులకు స్క్రిప్ట్స్ చదివి వినిపించాల్సిన రోజు వస్తుంది. ఎందుకు ఇండియాలో అడల్ట్‌ని ఓ క్రైమ్‌లా చూపిస్తున్నారు. ఓ ఒప్పుని తప్పు అని ఎందుకు చూపిస్తున్నారో నాకైతే అర్థంకావడంలేదు’ అని మండిపడ్డారు.

Related posts