నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికగా నటించారు. నితిన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ..
గుంటూరు జిల్లా ‘మాచర్ల నియోజకవర్గం’ లోఅక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. రాజప్ప (సముద్ర ఖని) గత ముప్పై ఏళ్లుగా ఏక గ్రీవంగా ఎన్నికవుతూ వస్తుంటాడు. తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసినవాళ్లను చట్టానికి దొరకకండా చంపేస్తుంటాడు. అతని భయానికి అధికార పార్టీ కూడా అక్కడ క్యాండిడేట్‌ను నిలబెట్టాలంటే భయపడే పరిస్థితి .
ఈ నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందుతాడు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాలని అతను చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? రాజప్ప ఏం చేశాడు? ఈ కథలో హైదరాబాద్ సిటీలో సిద్ధార్థ్ రెడ్డి పక్కింట్లో ఉండే గురు (వెన్నెల కిశోర్), అలాగే హీరోను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించే మినిస్టర్ కుమార్తె నిధి (కేథరిన్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ..
ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి.
కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై ‘మాచర్ల నియోజకవర్గం’ను ఆవిష్కరించాడు. హీరోయిన్ వెంటపడుతున్నా తనను ఫ్రెండ్‌గా చూశానని, ఆమెను ప్రేమించడం లేదని హీరో చెప్పడం… తర్వాత మరో అమ్మాయిని బీచ్‌లో చూసి ప్రేమలో పడటం… ఆమె కోసం విలన్లను కొట్టడం… రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు ఏమాత్రం దూరం వెళ్ళకుండా కథ రాసుకున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి, మరీ అంతే రొటీన్‌గా సినిమా తీశారు. ఫైట్లు, పాటలు, సన్నివేశాలు చూస్తుంటే… ఆల్రెడీ హిట్ అయిన కమర్షియల్ సినిమాల్లో ఎక్కడో చూసినట్టు ఉంటాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీ నటులు ఎవరెలా చేశారంటే?
గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. కలెక్టర్‌గా నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి .ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇకఅంజలి చేసిన ప్రత్యేక గీతం ‘రా రా రెడ్డి’ ప్రధానాకర్షణగా నిలిచింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ… పేరున్న నటీనటులు చాలా మంది సినిమాలో కనిపిస్తారు. అందరివీ రొటీన్ సీన్స్. దాంతో ఎవరికీ తమ ప్రత్యేకత చాటుకునే అవకాశం రాలేదు.
ముగింపు..
ఫైనల్‌గా రొటీన్ ఫార్ములాతో నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఉంది. ఫ్యామిలీతో కలిస్ ఒకసారి చూడచ్చు.
విశ్వం మా ఇద్దరినీ ఒకే చోట చేర్చింది… లాక్ డౌన్ అనుభవాన్ని షేర్ చేసిన రకుల్