telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఫిషియల్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్

ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు విన్పిస్తున్న విషయం తెలిసిందే. నేడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజక్టును ప్రకటించారు. ఈ విషయాన్ని ఈ రోజు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజక్టుకు ప్రముఖ నిర్మాత, పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తారు. తన ఎస్.ఆర్.టి బ్యానర్ పై ఆయనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన వార్తను నిర్మాత రామ్ ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ నెలాఖరులో విజయదశమి రోజున ఈ చిత్రం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆమధ్య దర్శకుడిగా మారిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్టును అందించనుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. నేడు పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన చిత్రాలకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనలు ఈ రోజు పలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పవన్ నటిస్తున్న “వకీల్ సాబ్”, క్రిష్ దర్శకత్వంలోని మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాగా… వాటికి భారీ స్పందన లభిస్తోంది.

Related posts