telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్వీటీతో ఇబ్బంది పడ్డాను… రవితేజతో రొమాన్స్ చేయించింది… : రాజమౌళి

rajamouli

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో 2005లో అనుష్క వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరవాత వరుసగా హీరోయిన్‌గా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ సినిమాతో అనుష్క క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరవాత ‘బాహుబలి’లో దేవసేన పాత్ర నటిగా అనుష్క స్థాయిని పెంచింది. అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘నిశ్శబ్దం’ మూవీ టీం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే, అనుష్కతో పనిచేసిన దర్శకులు చాలా మంది హాజరయ్యారు. అనుష్క గురించి రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విక్రమార్కుడు’ సినిమా సమయంలో స్వీటీ తనను చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ స్వీటీలో మీకు తెలియని ఒక లక్షణం గురించి చెబుతాను. ఆమె చాలా అబ్జర్వెంట్. అంటే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన డాటానంత ఏం చేస్తుందో నాకు తెలీదు. ‘విక్రమార్కుడు’ సినిమా చేసినప్పుడు స్వీటీతో కాస్త ఇబ్బందిపడ్డాను. ప్రతి షాట్‌ని చేసి చూపించమనేది. నేను చేసి చూపిస్తే దాన్ని తనకు అనుగుణంగా మార్చుకుని చేసేది. షాట్ చేయడమంటే ఇబ్బందిలేదు.. కానీ, రవితేజతో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. అంటే, శరీర భంగిమలతో సహా అన్నీ నాతో చేయించింది. అని రాజమౌళి సరదాగా చెప్పారు.

‘విక్రమార్కుడు’ సినిమా సమయంలో అనుష్క తమ కుటుంబానికి చాలా దగ్గరయ్యిందని రాజమౌళి చెప్పారు. కానీ, ఇప్పుడు అందరూ చెప్తున్న దాన్ని బట్టి ఈమె అందరితో కలివిడిగా ఉంటుంది. సాధారణంగా నా సినిమాల్లో హీరోయిన్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రలు క్రియేట్ చేయను. కానీ, దేవసేన పాత్రను క్రియేట్ చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే, ఆ పాత్రను స్వీటీ అంత గొప్పగా చేసింది’’ అని రాజమౌళి తెలిపారు. ఒక వ్యక్తిగా, నటిగా ఆమె అంటే తనకు ఎంతో గౌరవం అని రాజమౌళి చెప్పారు. ఆమెకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ‘నిశ్శబ్దం’ టీజర్, ట్రైలర్ రెండూ చాలా బాగున్నాయని.. ఏప్రిల్ 2వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఆరోజు ‘నిశ్శబ్దం’ విడుదలవుతోన్న విషయం తెలిసిందే. .

Related posts