telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబు భార్యను అప్సెట్ చేసిన ఆయన డ్రీం గర్ల్…?

Sobhan-Babu

శోభన్ బాబు ఆంధ్రులకు అందాల నటుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఈరోజు శోభన్ బాబు డ్రీం గర్ల్ వల్ల ఆయన భార్య ఎలా, ఎందుకు అప్సెట్ అయ్యారో తెలుసుకుందాం.

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

అవి శోభన్ బాబు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులు… స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు శోభన్ బాబు… దర్శకనిర్మాతలు కలుస్తూనే ఉన్నారు… ఆరోజు వాహినీ స్టూడియోలో “ఇల్లరికం” సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ షూటింగ్ చూడ్డానికి వెళ్లిన శోభన్ బాబును గేటు దగ్గరే యమధర్మరాజులా కాపలా కాస్తున్న బుర్ర మీసాల వాచ్ మెన్ ఆపేశాడు. అప్పట్లో స్టూడియోల్లోకి వెళ్లాలన్నా, అక్కడ జరిగే షూటింగ్ చూడాలన్నా ఎంతమందిని పట్టుకుని, ఎన్ని మొరలు పెట్టుకున్నా సరిపోయేది కాదు. గేటు దగ్గర వాచ్ మెన్ ఉండడంతో ఏం చేయాలో తోచక అక్కడే నిల్చున్న శోభన్ బాబును… ఆయన కంటే ముందునుంచే ఫీల్డులో తంటాలు పడుతున్న పరిచయస్తుడు ఒకరు పలకరించారు.

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఇద్దరిదీ ఒకే పొజిషన్… ఎలాగోలా లోపలికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఇద్దరూ. వాచ్ మెన్ కు మస్కా కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వాచ్ మెన్ కాళ్ళావేళ్ళా పడి, అతని గడ్డం పట్టుకుని “కాబోయే హీరోనయ్యా… ఆ మాత్రం జాలి చూపవా..” అంటూ బతిమాలారు శోభన్ బాబు. శోభన్ బాబు మాటలకు పక్కనున్న మిత్రుడు కూడా సపోర్ట్ చేశాడు. ఆ వాచ్ మెన్ ఏమనుకున్నాడో కానీ ఇద్దరినీ స్టూడియోలోకి పంపడానికి అంగీకరించారు.

ఆరవ ఫ్లోర్ లో షూటింగ్ జరుగుతోంది. ఇద్దరో కలిసి అక్కడకు వెళ్లారు. డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు “యాక్షన్” అంటూ అరిచారు. అల్లంత దూరం నుంచి వచ్చి ఆగిన ఫియట్ కారులోంచి ఆర్.నాగేశ్వరరావు, జమున దిగారు. శోభన్ బాబు ఎవరినైతే తన అభిమాన నటిగా ఆరాధిస్తున్నారో… ఆమెను ప్రత్యక్షంగా చూడడం అనేది శోభన్ బాబుకు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఆరోజు తన ఆరాధ్య దేవత జమునను తనివితీరా చూశారు శోభన్ బాబు.

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

ఇంటికి వస్తూనే సైకిల్ కు స్టాండు కూడా వేయకుండానే “శాంతా శాంతా…” అని గట్టిగా భార్యను పిలుస్తూ ఇంట్లోకి వెళ్లారు శోభన్ బాబు. ఆ అరుపులకు ఏం కొంప మునిగిపోయిందో అన్నట్టుగా వంటింట్లో ఎక్కడి పాత్రలు అక్కడే పడేసి పరిగెత్తుకొచ్చారు ఆయన భార్య. వెంటనే ఆమెతో “నా కలలరాణి… నా డ్రీం గర్ల్ ని చూశానోయ్” అన్నారు శోభన్ బాబు పట్టలేని ఆనందంతో. ఆ సంబరంలో శోభన్ బాబు గమనించలేదు కానీ ఆవిడ ముఖం చిన్నబోయింది. తరువాత తన పొరపాటును తెలుసుకున్న శోభన్ బాబు వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని “అదేనోయ్… హీరోయిన్ జమునను చూశానోయ్…”అంటూ తన సంతోషాన్ని ఆమెతో పంచుకున్నారు. ఆమె కూడా చాలా ఆనందించారు. అప్పుడే అనుకున్నారు శోభన్ బాబు పరాయి వాళ్ళ వల్ల తనకూ, తన భార్యకూ మధ్య ఎప్పుడూ గొడవలు రాకూడదు అని.

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

రోజూ ఏదో ఒక స్టూడియోను చూశానని, షూటింగ్ చూశానని లేదా హీరో హీరోయిన్లను చూశానని శోభన్ బాబు తన భార్యతో చెప్పడం, ఆమె ఈ విషయాలన్నింటినీ ఆసక్తిగా వినడం సర్వ సాధారణం అయిపోయింది. మొదట్లో ఈ విషయాలను తన భార్య శాంతతో ఎంతో ఆసక్తిగా పంచుకునేవారు శోభన్ బాబు. కానీ రానురానూ ఆ ఉత్సాహం తగ్గిపోయి దిగులు ప్రారంభమైంది శోభన్ బాబులో… షూటింగులు, అభిమాన తారల్ని చూడడం, దర్శకనిర్మాతలను కలవడం సరే… కానీ ఇలా ఎంతకాలం… ఎప్పుడూ స్టార్ల చుట్టూ తిరగడమేనా ? నేను స్టార్ అయ్యే రోజెప్పుడు వస్తుంది ? అని దిగులు చెందేవారు శోభన్ బాబు.

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

“దిగులు పడకండి… ఏదో ఒకరోజు మీరూ కెమెరా ముందు నిల్చొని ఫోజులిస్తారు… ఆరోజు తొందర్లోనే ఉందిలెండి…” అని ఆయన మనసును చదివినట్టుగానే అనేవారు శాంత. ఆమె మాటలు శోభన్ బాబుకు ఎంతో ఊరటనిచ్చేవి. అంతేకాదు తన భార్య ఇచ్చే ధైర్యంతో ఎప్పటికైనా గొప్ప హీరోను అవుతానన్న ధైర్యం శోభన్ బాబులో కలిగేది. అందుకే అంటారు పెద్దలు… ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అని.

జయలలిత తల్లిపై శోభన్ బాబుకు ఎందుకంత కోపం ?

Related posts