telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భార్గవ్ రామ్ కు కోర్టులో మళ్ళీ చుక్కెదురు…

బోయినపల్లి కిడ్నాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్న సంగతి తెలిసిందే.  అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోగా బెయిల్ పై బయటకు వచ్చింది. అయితే హాఫిజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను చేర్చారు.  అయితే, భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడో పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు. కానీ అతను బోయినపల్లి కిడ్నాప్ కేసులో మళ్ళీ కోర్ట్ ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సెషన్స్ కోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేసాడు భార్గవ్ రామ్. గతంలో సికింద్రాబాద్ కోర్ట్ భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టేసింది.దింతో మళ్ళీ సెషన్స్ కోర్టు లో ముందస్తు బెయిల్ పిటీషన్ ను భార్గవ్ రామ్ వేయగా దాని పై విచారణ జరిపి కొట్టేసింది. మరోవైపు ఇదే కేసులో భార్గవ్ రామ్ తల్లిదండ్రులు, జగత్ విఖ్యాత్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా వాటిని కూడా తిరస్కరించింది.

Related posts