శ్రీవిళంబి నామ సంవత్సరం మాఘ మాసం, పునర్వసు నక్షత్రంకు ఎంతో విశిష్టత ఉందని, ఈ నెల 17న పునర్వసు నక్షత్రంలో శ్రీరామకల్యాణం, అర్చన చేస్తే అంతా శుభం జరుగుతుందని శ్రీవైష్ణవ ఆగమ గ్రంథాలు తెలియజేస్తున్నాయని భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం సంస్కృత పండితులు గుదిమెళ్ల శ్రీమన్నారాయణాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతటి విశిష్టమైన రోజు 60ఏళ్ళ తర్వాత వస్తుందని పేర్కొన్నారు.
భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తిని దర్శించి అర్చన చేసిన వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయని, భద్రాచలం రాలేని వారు తమ గ్రామాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా విశేష ఫలితాలను పొందుతారని తెలిపారు. మళ్లీ ఇటువంటి రోజు కోసం 60 సంవత్సరాలు వేచి చూడాల్సివుంటుందని అన్నారు. నేడు శ్రీరాముని దర్శిస్తే, సకల శుభాలు, సౌఖ్యాలు కలుగుతాయని తెలిపారు.
“బిగ్ బాస్”లో మహిళా వివక్ష… యాంకర్ ఝాన్సీ ఫైర్