telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం టెండర్స్ ఖరారు…

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నమూనాని కూడా సీఎం ఫైనల్ చేసేశారు. ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులతో సీఎం ఖరారు చేసారు. ఆధునిక హంగులతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా కొత్త సచివాలయం ఉండనుంది. ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి గత నెలలో టెండర్లు ఆహ్వానించింది రోడ్లు భవనాల శాఖ. నిర్మాణ అంచనా వ్యయం రూ.500 కోట్లతో టెండర్లు పిలిచింది. పలు సంస్థలు టెండర్లు దాఖలు చేసాయి. గత నెల 18 నుండి ఈ నెల 1వ తేదీ  వరకు టెండర్లు స్వీకరించింది. ఇక ఈరోజు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్ లు ఖరారు అయ్యాయి. ఆ టెండర్లని కమిషనర్ ఆఫ్ టెండర్స్ ఖరారు చేసింది. ఈ టెండర్ ని షాపూర్జీ-పల్లొంజీ కంపెనీ దక్కించుకుంది. టెండర్లు ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వం – షాపూర్జీ-పల్లొంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ జరగనుంది. దాని ప్రకారం టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుండి 12 నెలల లోపు సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను నిర్మించాల్సి ఉంటుంది. ఏ సమయం వరకు ఎంత పూర్తి కావాలో కూడా టార్గెట్ పెడతారు. ఉదాహరణకు ఈ దీపావళికి సెక్రటేరియట్ భవనాల నిర్మాణం ప్రారంభమైతే.. వచ్చే ఏడాది దసరా దీపావళికి పూర్తి అవుతుందని చెబుతున్నారు అధికారులు. 

Related posts