telugu navyamedia
రాజకీయ వార్తలు

సుశాంత్ కేసులో బీహార్ జోక్యం సరికాదు: శివసేన

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. సుశాంత్ ఆత్మహత్య ఉదంతంపై సీబీఐ దర్యాప్తుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదేశించడాన్ని మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో బీహార్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అధికార పక్షం శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది.

గత కొన్నేళ్లుగా సుశాంత్ ముంబయి వాసిగా కొనసాగుతున్నాడని, అతడికి తగిన గుర్తింపును ఇచ్చింది ముంబయి నగరమేనని తెలిపింది. అతడు కష్టాల్లో ఉన్న సమయంలో బీహార్ కనీసం అతడికి మద్దతుగా కూడా నిలవలేకపోయిందని శివసేన విమర్శించింది. బీహార్ పోలీసులేమీ ఇంటర్ పోల్ విభాగం కాదు. ఈ కేసులో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మరో రాష్ట్రం జోక్యం చేసుకోరాదని శివసేన ‘సామ్నా’లో వ్యాఖ్యానించింది.

Related posts