telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

మద్యం మత్తులో యూట్యూబ్‌ స్టార్‌ రచ్చ రచ్చ..

మద్యం మత్తులో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్ రచ్చ రచ్చ చేశాడు. ఏకంగా మూడు వాహనాలను ఢీ కొట్టి బీభత్సం సృష్టించాడు జస్మంత్‌. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో కారు నడిపిన షణ్ముఖ్ జస్వంత్… జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం చేశాడు. ఏకంగా మూడు వాహనాలను తన కారుతో ఢీ కొట్టాడు యూట్యూబ్ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్. అందులో ఒక ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో భాగంగా బ్రీత్ ఎనలైజర్ లో టెస్ట్‌ చేస్తే.. షణ్ముఖ్‌ కి 170 రీడింగ్ వచ్చింది. దీంతో షణ్ముఖ్ జస్వంత్ పై కేసు నమోదు చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు.

Related posts