దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్- రేణిగుంట మధ్య పది వింటర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్‌లో (09715) ఈనెల 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్, సావిమాఽఽధోపూర్, కోట జంక్షన్, ఉజ్జయిని, భోపాల్, న్యూ అమరావతి, వార్దా జంక్షన్, వరంగల్, విజయవాడ, తెనాలి, గూడూరు మీదుగా రెండో రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. రేణిగుంటలో (09716) ఈ నెల 6, 13, 20, 27, వచ్చే నెల 3న రాత్రి 8.30 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే రెండో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు జైపూర్‌కు చేరుతుంది.
previous post