telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చిరంజీవి లాంటి మంచి కుటుంబంలో పుట్టావు..ఎందుకు నీకు ఈ ఖర్మ

*చిరంజీవి లాంటి మంచి కుటుంబంలో పుట్టావు..ఎందుకు నీకు ఈ ఖర్మ
*నేను ఇసుక త‌ర‌లిస్తున్నాన‌ని ప‌వ‌న్ దిగ‌జారి మాట్లాడుతున్నారు..
*త‌న‌ లారీలు ఉన్నాయ‌ని నిరూపిస్తే బెజ‌వాడ వదిలేస్తా..
*రెండు చోట్లా ఓడిపోయినా పవన్‌కు బుద్ధి రాలేదా
*చికోటీ ప్రవీణ్‌ను నాపేరు వంశీపేరు చెప్పాని బెదిరిస్తున్నారు..

పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని.. తన లారీలు ఇసుక తరలిస్తున్నాయని పవన్ ఆరోపించారని నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. .తన లారీలు వున్నాయని నిరూపిస్తే.. గుడివాడ వదిలి వెళ్లిపోతానని కొడాలి నాని సవాల్ విసిరారు.

చిరంజీవి లాంటి మంచి కుటుంబంలో పుట్టావు..ఎందుకు నీకు ఈ ఖర్మ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు భజన చేయాల్సిన అసవరం ఏంటని నిలదీసారు.రెండు చోట్లా ఓడిపోయినా పవన్‌కు బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.

బుద్ది ఉన్నాడు ఎవరైనా పవన్ పార్టీలో చేరుతారా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు లేని పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు.

లాగే గుడివాడలో క్యాసినో జరగలేదని, చికోటీ ప్రవీణ్‌ను కొంతమంది బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన పేరు, వంశీ పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్ట చేసారు.

క్యాసినోపై టీటీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా జగన్‌కు ముడిపెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

Related posts