తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని పక్కన పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా టీడీపీ కూడా ప్రచారం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రచారం నిర్వహించిన నారా లోకేష్… సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక పిల్లి అని.. ఆయన పార్లమెంట్‌కు 28 చిన్న పిల్లులను పంపిచారని మండిపడ్డారు. అంతేకాదు.. మోడీ ముందు పిల్లిలా అరుస్తారు అంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు నారా లోకేష్. “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంటింటికి వెళ్లి వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్న మోసాన్ని వివరించాను. రాష్ట్రంలో పెద్ద పిల్లి జగన్ రెడ్డి. ఆయన పార్లమెంట్ కి 28 చిన్న పిల్లుల్ని పంపాడు. 22 పిల్లులు లోక్ సభ లో, 6 పిల్లులు రాజ్యసభలో ఉన్నాయి. మోదీ గారిని చూస్తే మియాం అంటాయ్…ఆయన ఏ బిల్లు తెచ్చినా మియాం అంటాయి. ఇంకో పిల్లిని పంపుదామా? తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించండి మీ సమస్యలపై పార్లమెంట్ లో పోరాడే శక్తి ఆమెకు ఇవ్వండి అని సర్వేపల్లి ప్రజలను కోరాను.”అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.
previous post