telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ కవిత పేరుతో దారుణం.. యూట్యూబ్ ఛానల్ అని చెప్పి

ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొంచెం ఛాన్స్‌ దొరికితే చాలు.. అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపీల పేర్లనే వాడుతున్నారు. ఇటీవల కేటీఆర్‌ పేరుతో చేసిన ఓ ఘరానా మోసం మరువకముందే.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో కామారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగుచూసింది. ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పి ఏకంగా రూ. 6.50 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన మహేష్‌, వినోద్‌లు యూట్యూబ్‌ ఛానల్‌ జర్నలిస్టులమని చెప్పుకునేవారు. అంతేకాదు.. తమ యూట్యూబ్‌ ఛానల్‌కు ఎమ్మెల్సీ కవిత చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నట్లు మహమ్మద్‌ అనే వ్యక్తిని ఇద్దరు నిందుతుల నమ్మించారు. ఇందులో అతన్ని డైరెక్టర్‌గా తీసుకుంటామని.. నమ్మించి ఏకంగా రూ. 2 లక్షలు వసూలు చేశారు. తర్వాత డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మరో రూ. 4 లక్షలు అతని దగ్గర కొట్టేశారు. ఆ తర్వాత.. ఛానల్‌ ఐడీకార్డు కోసం ఏకంగా రూ. 50 వేలు వసూలు చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేష్‌, వినోద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Related posts