telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

గుండెపోటుతో యూసుఫ్ మెమన్ మృతి

1993 లో ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసుఫ్ మెమన్ ముంబైలోని నాసిక్ రోడ్డు జైల్లో మరణించాడు. యూసుఫ్ గుండెపోటుతో చనిపోయినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల సమయంలో బ్రష్ చేసుకునే సమయంలో యుసుఫ్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని నాశిన్ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు విడిచాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ధూలే మెడికల్ కాలేజీకి పంపారు.

ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన టైగర్ మెమన్ కి యూసుఫ్ సోదరుడు. ఈ కేసులో దోషిగా తేలడంతో కోర్టు యూసుఫ్ కి యావజ్జీవ కారాగారశిక్షను విధించింది. అప్పట్లో ఈ బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Related posts