తెలంగాణ లో ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది.
క్లాక్ టవర్ సెంటర్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఉన్నాడంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అభ్యర్థిని అక్కడి నుంచి పంపాలంటూ ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ వర్గీయుల నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ కోమటిరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
కేటీఆర్ ‘చిలక’ తో పోల్చిన చార్మినార్ ఎమ్మెల్యే…