telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవన్-హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఇదేనా..?

Pawan

మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడట. పవన్ కాలేజీ లెక్చరర్ గా, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా కనిపించబోతున్నారట. ప్పటికే ఈ చిత్రంలోని అనేక కీలకమైన భాగాలను చిత్రీకరించడానికి భారీ కళాశాల సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘సంచారి’ అనే టైటిల్ విన్పిస్తోంది. కాగా గతంలో పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts