telugu navyamedia
సినిమా వార్తలు

డియర్ కామ్రేడ్ : “ఎటుపోనే…” వీడియో సాంగ్

Dear-Comrade

విజ‌య దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన “డియ‌ర్ కామ్రేడ్” చిత్రం ఇటీవలే విడుదలై విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ తెలుగులో బాగానే కలెక్షన్లను రాబడుతోంది. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌ణ్ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్ల‌స్ అయింది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి “నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..” అనే పాట ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. తాజాగా “ఎటుపోనే…” అనే పాట వీడియో విడుద‌ల చేశారు. కాళ భైర‌వ ఆల‌పించిన ఈ పాట‌కి కెకె లిరిక్స్ అందించారు. ఇంటి నుండి బ‌య‌ట‌కి వ‌చ్చేసిన త‌ర్వాత బైక్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సాగించే ప్ర‌యాణం నేప‌థ్యంలో ఈ సాంగ్‌ని రూపొందించారు. ఈ పాట సినీ ప్రేమికుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. ఇక “డియ‌ర్ కామ్రేడ్” చిత్రం హిందీలోను రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. మరి అక్కడ ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts