telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇప్పటివరకు కివీస్ పై ఇండియాదే పై చేయి…!

టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ లో రసవత్తర పోరులో తలపడటానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచకప్‌కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తుండగా.. ఇరు జట్ల ఆటగాళ్లు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెగాటైటిల్ ఫైట్‌కు ముందు ఇరు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌తో పాటు… న్యూజిలాండ్‌పై టీమిండియా సాధించిన విజయాలే ఎక్కువ. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీకి మెరగైన రికార్డు ఉంది. అతను కివీస్‌పై ఇప్పటికే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 773 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌లో రాస్ టేలర్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. అతను 812 రన్స్ చేశాడు. అయితే గతేడాది ఆరంభంలో న్యూజిలాండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో భారత్ చిత్తుగా ఓడింది. చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది.

Related posts