ఐఫోన్ రాబోయే సీరీస్ లీక్ అయ్యింది. ఈ ఫోన్ పై సాధారణంగానే అంచనాలు ఉంటాయి. అయితే ఈ మోడల్ పై మొదటి నుండి సంస్థ ఆసక్తిని రేపే ప్రకటనలు చేస్తుండటంతో.. దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టే తెలుస్తుంది. ఇక అందుకోసమేనేమో మొత్తానికి ఈ మోడల్ ఎలా ఉంటుంది అనే ఆసక్తికి .. ఈ లీక్ వీడియో మరికాస్త ఆజ్యం పోసినట్టే ఉంది. సాధారణంగా, కొత్త ఐఫోన్ మోడల్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురు చూస్తుంటారనడంలో సందేహం లేదు.
ఈ సంవత్సరం సెప్టెంబర్ లో మార్కెట్ లోకి వస్తుందని భావిస్తున్న ఐఫోన్ ఎలెవన్ లో అదరగొట్టే ఫీచర్లు ఉన్నాయట. ఈ ఫోన్ కు సంబంధించిన వీడియో ఒకటి లీకై, వైరల్ అవుతోంది. ఇందులో కనిపిస్తున్న ప్రకారం, నూతన మోడల్ లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. తన తాజా మోడల్ ఐఫోన్ ఎక్స్ ఎస్ లో వెనుక రెండు కెమెరాలు అమర్చిన యాపిల్, కొత్త మోడల్ లో 3డీ ఇమేజ్ లకు మద్దతిచ్చేలా మరో కెమెరాను అమర్చనుంది. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సంస్థలు 3డీ ఇమేజ్ ఆప్షన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజా లీక్ పై యాపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Video source : digitindia