మున్సిపాలిటీల అభివృద్ధికి చేపట్టే పనులపై ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రికేటీఆర్ సూచించారు. గురువారం హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పురపాలకసంఘాల పరిధిలో, పట్టణాల్లో రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రజలకు ప్రాధమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని వివరించారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను ఖచ్చితంగా అమలు జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామానాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్లు ఆర్‌వి కర్ణన్, ఎంవిరెడ్డి, ఖమ్మం మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సీఎం జగన్ అసత్యాలతో తమకు సవాల్ విసురుతున్నారు: చంద్రబాబు