telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసుల వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, ప్రాజెక్ట్ సి.ఇ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడీ, యాదగిరిరావు, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సిసిపి శ్రీనివాసరావు, హౌసింగ్ ఎస్.ఇ విద్యాసాగర్, ప్రాజెక్ట్ ఎస్.ఇ లు వెంకటరమణ, రవీంద్ర రాజు, ఎస్.డబ్ల్యూ.ఎం కోటేశ్వరరావు, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, చీఫ్ వెటర్నరీ డా. అబ్దుల్ వకీల్, సి.ఎం.హెచ్.ఓ డా.పద్మజ, జాయింట్ కమిషనర్లు శశికళ, సంద్య, ఉమా ప్రకాష్, స్పోర్ట్స్ డైరెక్టర్ భాషా, పి.డి సౌజన్య, సెక్రటరీ లక్ష్మి, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. నీళ్లు, నిధులు  నియమకాలు మలి దశ  స్వరాష్ట్ర సాధనలో 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ దశాబ్దానికి చేరుకున్నాము. ఉద్యమ నాయకుడు KCR గారు  ముఖ్యమంత్రి కావడం వలన  ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమ పథకాలను వినూత్న పద్ధతిలో అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.

GHMCలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన ప్రజా రవాణా కోసం ఆధునిక రోడ్డు వ్యవస్థ, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధికి నగర వాసులకు GHMC ద్వారా పూర్తి తోడ్పాటు అందిస్తున్నదన్నారు.

Ward Office:  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజల ముంగిట్లో పరిపాలన అందించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ KTR గారి ఆలోచన మేరకు వార్డ్ ఆఫీసులను ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ప్రజల ముంగిట్లో పరిపాలనతో పాటు సమస్యల విన్నపాలను వేగవంతంగా పరిష్కరించే దిశగా వార్డు కార్యాలయాలు పని చేస్తాయి. ప్రస్తుతం GHMC Head Office, Zonal, Circle మూడంచెల వ్యవస్థ ద్వారా పరిపాలన కొనసాగుతున్నది. మరింత సంతృప్తికరమైన సేవలను అందించేందుకు 4వ పరిపాలన Unit గా వార్డు కార్యాలయాలను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 10వ తేదీన సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడుతుందని తెలిపారు.

GHMC వ్యాప్తంగా ఉన్న 150వార్డులలో ఏర్పాటు చేసే వార్డు కార్యాలయంలో 10 మంది సిబ్బందిలో వార్డు పరిపాలన అధికారి ప్రధాన భూమిక కలదు. అతనితో పాటుగా Engineering, Entomology, Sanitation, Urban Community, Bioversity, విద్యుత్, జలమండలి సిబ్బంది పని చేస్తూ వివిధ మాధ్యమాలు ద్వారా వచ్చిన పిర్యాదులు సిటిజెన్ చార్టు ప్రకారంగా పరిష్కారం చేస్తారని తెలిపారు.

*SRDP:*   నగరంలో వివిధ రద్దీ జంక్షన్ లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపర్చుటకు SRDP ద్వారా ఇప్పటి వరకు రూ.33,248.53 కోట్ల వ్యయంతో వివిధ రకాల 35 పనులను పూర్తి చేశారు. అందులో 19 ఫ్లై ఓవర్లు, 7 ఆర్.ఓ.బి లు/ఆర్.యు.బి లు, 5 అండర్ పాస్ లు, 1 Cable bridge, పంజాగుట్ట Bridge, ORR నుండి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తయ్యాయి. మిగతా 13 పనులలో 10 పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

*SRDP రెండోదశ:* అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు రావడానికి ఆధునిక రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి రొండోదశ SRDP చేపట్టారు. Traffic రద్దీ గల ప్రాంతాలను గుర్తించి Flyovers, ROB, Under Pass, Grade Separate లు చేపట్టి ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ అందుబాటులో తేవడానికి రూ. 4,305 కోట్ల అంచనా వ్యయంతో 36 పనులను చేపట్టేందుకు ప్రతిపాదించినట్లు వివరించారు.

*CRMP:*  GHMC వ్యాప్తంగా 9013 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు వందకు వంద శాతం అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన (all weather) రోడ్డు గా గుర్తింపు పొందింది. BT రోడ్డులో అధిక ట్రాఫిక్ రద్దీ గల రోడ్డు 812 కిలో రోడ్డు పొడవు గల రోడ్డు సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం ద్వారా చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వాహన దారులు ఎలాంటి సమస్యా లేకుండా సాఫీగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 775.86 కి.మీ పొడవు గల రోడ్డును Re-Carpet చేశారని తెలిపారు.

*HRDCL:*     ప్రధాన రహదారుల్లో పెరుగుతున్న Traffic రద్దీ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా Missing, Link రోడ్లను చేపట్టి హైదరాబాద్ అర్బన్ సమూహం (HUA) పరిధిలో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి తేవడానికి  ఇప్పటి వరకు రూ.535.59 కోట్ల వ్యయంతో 38 పనులు చేపట్టి 47.13 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదించగా అందులో 27.30 కిలోమీటర్లు గల 25 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని తలిపారు.

*Road Net Work (Engineering Section):*    GHMC వ్యాప్తంగా 9,013 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు కలదు. అందులో 68.42 శాతం గల CC రోడ్డు కాగా,  31.58 శాతం అనగా 2,846  కిలో మీటర్లు తారు రోడ్డు ఉన్నదని తెలిపారు.

గత ఆర్థిక (2022-23) సంవత్సరంలో 4790 రోడ్డు పనులు రూ.1274 కోట్లతో చేపట్టగా అందులో రూ.697 కోట్ల విలువ గల 2480 పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోరూ.567కోట్ల విలువ గల 2162 పనులు మంజూరు చేయగా అందులో ఇప్పటి వరకు సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 22 పనులు పూర్తయ్యాయన్నారు.

*Model Grave Yard:* మానవుని చివరి మజిలీ సందర్భంగా దహన సంస్కారాల కోసం వచ్చే బంధువులకు అన్ని వసతులను ఆధునిక పద్దతి ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39 వైకుంఠ దామాలను రూ.57 కోట్ల వ్యయంతో చేపట్టగా 29 పనులు పూర్తి కాగా మిగతా పనులు అభివృద్ధి దశలో కలవు. ప్రహరీగోడ నిర్మాణం, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా బాత్ రూములు టాయ్లెట్లు, వాష్ ఏరియా Sitting, Gallery,  బూడిదను భద్రపరిచే గది, Parking, Greenery సౌకర్యం, అవసరమైన చోట Office Place, Shopping Complex, Lighting వసతులు కల్పించినట్లు తెలిపారు.

*Multi Purpose Function Hall:*    బీదలు కూడా తమ పిల్లల Marriage లు నామామాత్రం రుసుం చెల్లించి Function లను జరుపుకొనుటకు GHMC సకల వసతులతో కూడిన మల్టీ ఫర్పస్ ఫంక్షన్ హాల్ రూ.95.08కోట్ల అంచనా వ్యయంతో 24 చేపట్టగా 9 Function Hall అందుబాటులోకి వచ్చాయి. మిగతా పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయని తెలిపారు.

*Model Corridors:*   గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ నగర స్థాయిలో వసతి కల్పించేందుకు GHMC విశేష కృషి చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేసింది. ఈ నేపథ్యం ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పు గల రోడ్లలో ఈ Model Corridors చేపట్టనున్నారు. నగరవ్యాప్తంగా 29 Model Corridors ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టుటకు GHMC నిర్ణయించింది. మొదటి దశలో రూ.52.72 కోట్ల అంచనా వ్యయంతో 15.54 పొడవు 16 పనులను మంజూరు చేశారు. అందులో 9 పనులు ప్రారంభం కాగా మరో ఐదు పనులు త్వరలో చేపట్టనున్నారు. Model Corridorsలో Parking, Greenery, Vending Zones, Cycle Track ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

*Pedestrian Friendly Facility City Hyderabad:*  పాదచారులు ఇరువైపులా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా రోడ్డు దాటడం కోసం Foot Over Bridge లను నిర్మాణం చేపట్టింది. జిహెచ్ఎంసి ద్వారా గతంలో 20 Foot Over Bridge లను చేపట్టగా ప్రస్తుతం రూ.74.65 కోట్ల వ్యయంతో 22 Foot Over Bridge లను చేపట్టగా 10 పనులు పూర్తయ్యాయి. Foot Path, Foot Over Bridge నిర్మాణాలే కాకుండా నగరంలో ప్రతి Zone లో 2 Junction ల అభివృద్ది, సుందరీకరణ ప్రయోగాత్మకంగా చేపట్టిన 12 పనులతో పాటుగా మరో 102 Junctionల భివృద్దికి ప్రతిపాదించారు. అంతేకాకుండా Hyderabad Metro Rail అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 Metro Stations వద్ద ఇరువైపులా వెళ్లేందుకు Foot Over Bridge లను చేపట్టి పాదచారుల ప్రమాదాలను నివారించేందుకు భద్రత, రక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

*SNDP (STRATEGIC NALA DEVELOPMENT PROGRAMME):* వరదల వలన నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. వరద ముంపు నివారణకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి మేరకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. తద్వారా GHMC, దాని చుట్టూ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో ఎదుర్కొంటున్న వరద ముంపు నివారణ కోసం  రూ.985.45 కోట్ల అంచనా వ్యయంతో 57 పనులు మంజూరు చేశారని తెలిపారు.

అందులో GHMC పరిధిలో రూ.747 కోట్ల అంచనా వ్యయంతో 35 పనులు చేపట్టారు. అందులో ఇప్పటి వరకు 23 పనులు పూర్తి కాగా మిగతా పనులు జూన్ చివరలో పూర్తి అవుతాయి. మిగతా 6 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.

*చెరువుల సుందరీకరణ, CSR:*  CSR పద్ధతిన 14 చెరువులను అభివృద్ధి చేయడం జరుగుతున్నది. మరో 26 చెరువులను అభివృద్ధికి వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. GHMC పరిధిలో ఉన్న చెరువులలో మురుగు నీరు మళ్లింపుతో పాటు చెరువు పునరుద్దరణ, కట్ట పటిష్టత కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30కోట్ల వ్యయంతో 16 పనులు మంజూరు అయ్యాయని తెలిపారు.

*Waste to Energy:*   హైదరాబాద్ కు నలూవైపులా Waste to Energy Plants ను 100 Mega watts Capacity తో ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే జవహర్ నగర్ Dump Yard లో 24 Mega Watts  విద్యుత్ తయారు చేస్తుండగా, మరో 24 Mega Watts  మంజూరు కాగా అట్టి పనులు కోనసాగుతున్నాయి. Dindigal లో 14.5, ప్యారానగర్ లో 15, బిబి నగర్ లో 11, యాచారంలో14  Mega Watts Capacity గల Waste to Energy  Plants రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయనున్నామని తెలియజేస్తున్నాను. తద్వారా నగరంలో  రోజు వారి సేకరిస్తున్న చేతను నిల్వ ఉంచకుండా Treatment చేసి విద్యుత్ తయారీకి వినియోగించబడుతుందని తెలిపారు.

*భవననిర్మాణ వ్యర్థాల నిర్వహణ(C&D Plant):*   పర్యావరణ పరిరక్షణలో బాగంగా నగరంలో ఏర్పడుతున్న భవన నిర్మాణ, కూల్చి వేసిన వ్యర్థాలను నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరం నలువైపులా C&D Recycling Plant ల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రతి రోజూ 2000 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేయడం జరిగింది. అందుకోసం జీడిమెట్ల, ఫతుల్లగూడ లతో పాటు శంషాబాద్ వైపు శాతంరాయ్,  శామీర్ పేట  తూంకుంటలో  ఒక్కొక్కటి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రీసైక్లింగ్ చేస్తారని తెలిపారు.

*Animal Care Center:*   జంతు సంవరక్షణ కోసం నగరంలో 5 ప్రాంతాల్లో Animal Care Center లను ఏర్పాటు చేసి Birth Control శస్త్ర చికిత్స చేయడం జరుగుతున్నది. కుక్కల బెడద, కుక్కకాటు నివారణకు Corporator  లతో High Level Committee  నియమించారు. High Level Committee సిపార్సు చేసిన 26 అంశాలను ఆమోదించి పటిష్ట అమలుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

*పెంపుడుజంతువులCrematoriums:*  ఫతుల్లగూడలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెంపుడు జంతువుల క్రిమిటొరోయం నిర్వహించబడుతున్నది. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ఆదేశాల మేరకు మరో 5 పెంపుడు జంతువుల క్రిమిటోరియాల ఏర్పాటు చేస్తున్నారు. జోన్ కు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

*Dog Park:*  దేశంలో మొట్ట మొదటి సారిగా పెంపుడు కుక్కల కోసం కొండపూర్ 1.3 ఏకరాల స్థలంలో  Dog Park ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. ఈ పెంపుడు కుక్కల పార్కును రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పార్కుల్లో అవసరమైన కావాల్సిన వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Related posts