telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ ను విడుదల చేస్తాం: జగన్

ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వంద రోజుల పాలనను పురస్కరించుకొని శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను మంచి ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలనే మంచి ఉద్దేశంతో వైఎస్‌ఆర్ ట్రిపుల్ ఐటీని స్థాపించారని అన్నారు.

డబ్బులు లేవని ఏ పిల్లవాడు కూడా చదువు మానకూడదన్నారు. మన పిల్లలకు అందించే ఆస్తి చదువు మాత్రమే అని స్పష్టం చేశారు. మన పిల్లల మీద పూర్తిస్థాయి నమ్మకంతోనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రతి ట్రిపుల్ ఐటీలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పెడతామని, ఇంక్యుబేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

Related posts