telugu navyamedia
రాజకీయ వార్తలు

అక్రమ వలసలు తనిఖీ చేయడానికి జాబితా అవసరం: సీఎం యోగి

yogi adityanath

రాష్ట్రంలోకి అక్రమ వలసలు తనిఖీ చేయడానికి ఎన్‌ఆర్‌సి జాబితాఅవసరం అవుతుందని ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యానాథ్‌ తెలిపారు. అసోం ఎన్‌ఆర్‌సి తరహాలో పౌరుల జాబితాను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశ రక్షణ దృష్ట్యా యూపిలో కూడా పౌరుల జాబితాను రూపొందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో చర్చిస్తానని చెప్పారు.

ఇటీవల అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సి నివేదికతో ఓ వైపు ఆరాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా పౌరుల జాబితాను రూపొందించాలని దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపి సైతం యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అసోంలో పౌరుల జాబితాను రూపొందించడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. రాష్ట్రంలో కూడా అవసరమైతే ఎన్‌ఆర్‌సి జాబితాను రూపొందిస్తామని అన్నారు.

Related posts