telugu navyamedia
తెలంగాణ వార్తలు

నాపై దాడి వెనుక ఎవ‌రున్నారో తేల్చే బాధ్య‌త మోదీదే..!

*తనపై జరిగిన దాడిపై ప్ర‌త్యేక‌ విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ ..
 *దర్యాప్తు ప్రారంభించాల్సిన బాధ్యత మోదీ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలపై ఉందన్న‌ ఒవైసీ..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రోడ్డుమార్గంలో ఢిల్లీకి వెళ్తుండగా హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒవైసీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తనపై కాల్పుల ఘటనపై అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారు… తాను ఎప్పుడూ భద్రతను కోరుకోలేదని, ఎందుకంటే తన ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఒవైసీ చెప్పారు. త‌న‌పై కాల్ప‌లు జ‌రిపింది ఎవ‌రో ద‌ర్యాప్తు జ‌రిపించే బాధ్యత ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎరుపు, తెలుపు రంగు జాకెట్లు ధరించిన ఇద్దరు నిందితులు తన కారుపై కాల్పులు జరిపారని, వారు ఉపయోగించిన తుపాకీ శబ్ధం ఆధారంగా అది దేశంలో తయారు చేసిన తుపాకీ కాదని, 9ఎంఎం పిస్టల్ అని చెప్పారు.

Asaduddin Owaisi demands independent inquiry after shots fired on his car  in UP; shooters arrested

ఈ కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నాని, ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలుస్తానని ఒవైసీ తెలిపారు. తాను అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ప్రచారాన్ని కొనసాగిస్తానని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయ్యింది. దీంతో అసదుద్దీన్ ఒకపై ఎక్కడికి వెళ్లినా సీఆర్పీఎఫ్ జవాన్లు ఆయన వెంట ఉండనున్నారు.

 

Related posts