telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి… పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

Sushanth

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. సుశాంత్ మరణించిన 45 రోజుల తరువాత… సుశాంత్ తండ్రి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేయడం, రియా కన్పించకుండా పోవడం, పోలీసులకు సంబంధించిన వీడియో లీక్ కావడం తదితర అంశాలు చూస్తుంటే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఖచ్చితంగా ఇది హత్యేనని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని చాలామంది కోరుతున్నారు. కాగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ అల్కా ప్రియ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో సుశాంత్‌ చాలా మంచోడని, నాసాకు వెళ్లేందుకు చాలామంది పిల్లలకు అతడు సాయం చేశాడని పేర్కొన్నారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని బెంచ్‌.. ”ఒక వ్యక్తి మంచోడా..? చెడ్డోడా..? అన్న దానిపై కాదు. కానీ ఈ కేసును ఇప్పుడు ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. అందుకే ఈ పిటిషన్‌ని కొట్టివేస్తున్నాము” అని అన్నారు.

Related posts