telugu navyamedia
సినిమా వార్తలు

నా పాత్ర‌కు ఖచ్చితంగా దీపికా అయితేనే బాగుంటుంది… కానీ… : పీవీ సింధు

PV-Sindhu

తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. అంత‌ర్జాతీయ పోటీల్లో అనేక ప‌త‌కాలు పొందిన ఆమె జీవితం ఆధారంగా బ‌యోపిక్ ను తెరకెక్కించేందుకు సోనుసూద్ ముందుకు వ‌చ్చారు. ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటించనున్నారు. అయితే పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై కొద్ది రోజులుగా చర్చ‌లు జ‌రుగుతుండ‌గా, అక్కినేని కోడ‌లు స‌మంత‌ని ఫైన‌ల్ చేసార‌నే టాక్ న‌డుస్తుంది. కానీ తాజాగా సింధు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “త‌న పాత్ర‌లో ఖ‌చ్చితంగా దీపికా ప‌దుకొణే న‌టించాల‌ని భావిస్తున్నాని తెలిపింది. ఆమె చురుకైన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌తో పాటు మంచి న‌టి. అందుకే నా పాత్ర‌లో దీపికాని చూడాల‌ని అనుకుంటున్నాను. ఇక తుది నిర్ణ‌యం మేక‌ర్స్‌దే అని సింధు పేర్కొంది. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే, క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న “83” చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి మొత్తానికి ఈ చిత్రంలో సింధు పాత్రలో ఎవరు కన్పిస్తారో చూడాలి.

Related posts