telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఘర్షణ ‘కు 16 ఏళ్లు..టీంకి థాంక్యూ చెబుతూ వెంకీ ట్వీట్

Gharshana

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఘర్షణ చిత్రం విడుదలై నేటితో 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెంకటేష్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ‘ఘర్షణ రిలీజ్ అయి 16 ఏళ్లయింది. ఈ సినిమాని ప్రేమించిన వారికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. అలాగే అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చిన గౌతమ్ మేనన్, హీరోయిన్ గా నటించిన అసిన్, గుర్తుండిపోయే పాటలిచ్చిన హరీష్ జైరాజ్ కి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. వెంకీ ట్వీట్ పై స్పందించిన యంగ్ హీరో వరుణ్ తేజ్ ‘ ఘర్షణ ‘ మూవీ నా ఫేవరేట్ సినిమాల్లో ఒకటి. అందులోని సాంగ్స్ అంటే ఎంతో ఇష్టం ‘ అని ట్వీట్ చేశారు. 2004 జూలై 30న విడుదలైన ఘర్షణ మొదట మిశ్రమ స్పందన అందుకున్నా ఆ తర్వాత పుంజుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్. హరీష్ జైరాజ్ చక్కటి ట్యూన్స్ ఇచ్చారు. ఇక గౌతమ్ మేనన్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకీని అంతకుముందు ఎన్నడూ చూడని విధంగా స్టైలిష్ పోలీసుగా అందంగా చూపారు. ఇక ఈ సినిమా టీవీలో మాత్రం పెద్ద హిట్ గా నిలిచింది. ఎప్పుడు ప్లే అయినా మంచి రేటింగ్స్ నమోదు చేస్తూనే ఉంటుంది. ఈ చిత్రాన్ని గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మించారు.

Related posts